10th Class Student Raped by Teacher: విద్యార్థులకు మంచి చెడుల మధ్య భేదాన్ని వివరించి.. మంచి నేర్పించాల్సిన ఉపాధ్యాయులే దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఉపాధ్యాయ వృతికే కళంకం తెచ్చే విధంగా వారు వ్యవహరిస్తున్నారు. రేపటి భవిష్యత్ తరాలను రూపుదిద్దాల్సిన ఉపాధ్యాయులే.. అవినీతికి పాల్పడుతూ బోధన వృత్తికే మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు
శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓ ఉపాధ్యాయుడు పదో తరగతి విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడగా ఆ విద్యార్థిని గర్బం దాల్చింది. మరో వైపు ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి.. పాఠశాల అభివృద్ధి కోసం విడుదలైన 'నాడు-నేడు' నిధులను సొంత ఖర్చులకు వినియోగించుకుంది. సమాచారం తెలుసుకున్న జిల్లా అధికారులు దర్యాప్తు జరిపి వారిపై చర్యలు తీసుకున్నారు.
పదో తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడి లైంగిక దాడి : జిల్లాలోని తనకల్లు మండంలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో రెడ్డి నాగయ్య అనే ఉపాధ్యాయుడు తెలుగు బోధిస్తున్నాడు. అయితే అతడు బోధిస్తున్న పాఠశాలలోని పదో తరగతి విద్యార్థినిపై కన్నేశాడు. ఆ విద్యార్థినికి మాయమాటలు చెప్పి తన లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. ఇలా పలుమార్లు ఆ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడటంతో గర్భం దాల్చింది. ఉపాధ్యాయుడి కామ వాంఛకు బలైన విద్యార్థిని.. మగ బిడ్డకు జన్మనిచ్చింది.
అసలు విషయం తెలుసుకున్న.. తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు. స్పందించిన డీఎస్పీ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి రెడ్డి నాగయ్యను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు ఆ ఉపాధ్యాయుడ్ని అరెస్టు చేశారు.
Anantapur SP on gang rape case: మహిళపై అత్యాచారం ఆరోపణలపై... ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు.. కానీ..!
పాఠశాల నిధులు కాజేసిన ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు: సత్యసాయి జిల్లాలోని తనకల్లు మండలం నల్లగుట్లపల్లి ప్రభుత్వోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు నివేదిత అవినీతికి పాల్పడింది. పాఠశాల ఖాతా నుంచి అక్రమంగా నాడు నేడు నిధులను విడుదల చేసి.. సొంత ఖర్చులకు వినియోగించుకుంది. పాఠశాల నిధులను ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీ ద్వారా డ్రా చేసి అక్రమానికి పాల్పడింది.
రెగ్యులర్ హెడ్మాస్టర్ శ్రీధర్ రెడ్డి విధులు చేపట్టిన తర్వాత ఆయన నివేదితను పాఠశాల రికార్డులు ఇవ్వాలని కోరాడు. పలుమార్లు అడిగినా ఆమె రికార్డులు అందించకపోవటంతో అతనికి అనుమానం కలిగింది. దీంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు చేపట్టి విచారణ ప్రారంభించారు. విచారణలో పాఠశాలకు 'నాడు- నేడు' రెండో విడత కింద విడుదలైన నిధులను.. సహాయ ఇంజనీరింగ్, తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షురాలు సంతకాలను ఫోర్జరీ చేసి నిధులను డ్రా చేసినట్లు తేలింది. దీంతో అక్రమానికి పాల్పడిన నివేదితను.. విధుల నుంచి తొలగిస్తూ.. జిల్లా విద్యాశాఖాదికారి ఆదేశాలు జారీ చేశారు.
Gang Rape SC Woman: స్నానం చేస్తుండగా వీడియో తీసి.. ఒంటరి మహిళపై ఏడాదిగా ఆరుగురు అత్యాచారం