MP Magunta Srinivasulu Reddy: కేంద్రం అమలు చేసే పథకాల విషయంలో అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని ప్రకాశం జిల్లా దిశ కమిటీ ఛైర్మన్ , ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. దిశ(జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ) సమావేశంలో.. స్థానిక ప్రజాప్రతినిధులు పలు అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా మాట్లాడిన దిశ ఛైర్మన్, ఎంపీ మాగుంట.. అర్హులైన పేదలందరికీ పథకాలు అందాలని సూచించారు. కీలక సమావేశానికి అధికారులు సమగ్ర సమాచారంతో రావాలని సూచిచారు. సభ్యులు చర్చించిన అంశాలపై సత్వరమే జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నప్పుడే కమిటీ ఉద్దేశ్యం నేరవేరుతుందని అన్నారు.
ఎంపీ మాగుంట ఆగ్రహం..
ప్రోటోకాల్ విషయంపై ఎంపీ మాగుంట ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారంలో ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రొటోకాల్ అమలుపై కలెక్టర్ దృష్టిపెట్టాలని.. పరిస్థితి ఇలాగే కొనసాగితే లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందన్నారు.
ఇదీ చదవండి
RGV On Movie Tickets: టికెట్ల అంశంపై వర్మ వరుస ట్వీట్లు.. ఏపీ సర్కార్‌పై ప్రశ్నల వర్షం