రాయలసీమకు నీళ్లు ఇచ్చే విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు (CBN) ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి(BALINENI SRINIVASA REDDY), ఆదిములపు సురేశ్ (ADIMULAPU SURESH)లు విమర్శించారు. నీటి విషయంలో.. ప్రకాశం జిల్లాకు అన్యాయం జరిగిపోతుందంటూ ఆ జిల్లా ఎమ్మెల్యేల చేత చంద్రబాబు లేఖ విడుదల చేయించడాన్ని తప్పుపట్టారు.
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వివాదాలకు తెరలేపిందని మంత్రులు ఆరోపించారు. దీనిపై మాత్రం చంద్రబాబు స్పందించడంలేదని అన్నారు. ప్రాంతాలు మధ్య చిచ్చు రేపేందుకు చంద్రబాబు కుట్రపన్నుతున్నారని మంత్రులు ఒంగోలులో అన్నారు. కృష్ణా జలాలు వాటా విషయంలో కేంద్రం తీసుకున్ననిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని.. మనకు రావలసిన చుక్క నీటిని కూడా వదులుకోబోమని.. అదేవిధంగా ఒక్క చుక్క నీటిని కూడా అదనంగా వినియోగించమని నేతలు స్పష్టం చేశారు.
ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన..
ప్రకాశం జిల్లా ఒంగోలు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో ఇండో అమెరికన్ ఆర్థిక సహాయంతో నిర్మితమవుతున్న 100 పడకల భవనానికి రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసలురెడ్డిలు శంకుస్థాపన చేసారు. అనంతరం ఎంపీ ల్యాడ్స్‌తో కొనుగోలు చేసిన రెండు బ్యాటరీ కార్లను వారు ప్రారంభించారు. ఆసుపత్రి సిబ్బంది వినియోగం కోసం పీపీఈ కిట్లు, శానిటైజర్లు, గ్లౌజ్‌లు, మాస్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, రిమ్స్ సూపరింటెండెంట్ శ్రీరాములు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
ప్రియురాలితో బ్రేకప్ అయితే ఇలా కూడా చేస్తారా?
veligonda:'కేంద్ర గెజిట్‌లో వెలుగొండ ప్రాజెక్టును చేర్చేలా బాధ్యత తీసుకోవాలి'