ETV Bharat / state

మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన వైకాపా నాయకుడు - అద్దంకి వార్తలు

గణతంత్ర దినోత్సవం రోజున ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండా ఎగరవేస్తారు. కానీ ప్రకాశం జిల్లా అద్దంకి మున్సిపల్​ కార్యాలయంలో వైకాపా నాయకుడు జాతీయ జెండా ఎగరవేశారు. అది కూడా సంబంధిత అధికారి సంమక్షంలో జరగడం కొసమెరుపు.

flag hosting
మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన వైకాపా నాయకుడు
author img

By

Published : Jan 26, 2021, 9:20 PM IST

ప్రకాశం జిల్లా అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా జాతీయ జెండాను ఎగురవేయాల్సి ఉంది. కానీ వైకాపా అద్దంకి ఇన్​ఛార్జ్​ బాచిన కృష్ణ చైతన్య ఆ పని చేశారు. నియోజకవర్గమంతా ఆ అంశం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాను ఎగుర వేయాల్సి ఉండగా.. అద్దంకిలో ఈ విధంగా జరగడం చూస్తుంటే అద్దంకి రూటే సపరేటు అని స్థానికులు చర్చించుకుంటున్నారు.

ప్రశంసాపత్రాలు అందజేస్తూ
ప్రశంసాపత్రాలు అందజేస్తూ

ఇదీ చదవండి: ప్రకాశం జిల్లాలో రైతుల భారీ ర్యాలీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.