ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో 2వేల మందికిపైగా వైకాపా మద్దతుదారులు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. అర్ధవీడు మండలం రంగాపురం గ్రామంలో నిర్వహించిన గౌరవ సభ కార్యక్రమంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. రంగాపురంలో నిర్వహించిన గౌరవ సభకు ప్రకాశం జిల్లాలోని తెదేపా ముఖ్యనేతలు హాజరయ్యారు.
గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్ధన్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి.. వైకాపా నుంచి వచ్చిన వారికి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
తెదేపా అధికారంలోకి రాగానే మార్కాపురం కేంద్రంగా జిల్లాను.. చంద్రబాబు ప్రకటిస్తారని నేతలు చెప్పారు. వైకాపా ప్రభుత్వం రైతులను దారుణంగా మోసం చేసిందని.. గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని మండిపడ్డారు.
ఇదీ చదవండి: