పర్చూరు వ్యవసాయ మార్కెట్ ఆవరణలో వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం గోడ పత్రికను వైకాపా నియోజకవర్గ బాధ్యుడు రామనాథం బాబు ఆవిష్కరించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వటమే సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశ్యమని ఆయన అన్నారు.
పొలాలకు మీటర్లు బిగించడం వల్ల ఏ ప్రాంతాల్లో ఎంత విద్యుత్ అవసరమవుతుందో తెలుస్తుందని... నాణ్యమైన విద్యుత్ రైతులకు అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ డీఈ రామకృష్ణ, అద్దంకి, పర్చూరు ఏడీలు, ఏఈలు, రైతులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: