DRAWING: జీవం ఉట్టిపడేలా అనేక రకాల చిత్రాలు గీస్తూ మన్ననలు పొందుతోంది ప్రకాశం జిల్లా దర్శి యువతి రత్నాకర మనీషా. పాఠశాల రోజుల్లోనే చిత్రలేఖనంపై ఆమెకు ఉన్న ఆసక్తిని గుర్తించి చిత్రలేఖన ఉపాధ్యాయుడు ప్రోత్సహించారు. అలా ఎక్కడా ప్రత్యేకంగా శిక్షణ పొందకపోయినా.. చిత్రకళపై పట్టు సాధించింది.
కరోనా సమయంలో తన చిత్రకళనే ఉపాధిగా మార్చుకుంది మనీషా. తన చిత్రాలను సోషల్ మీడియాలో ఉంచడంతో కొందరు తమకూ అలాంటి చిత్రాలు కావాలని అడిగేవారు. అలా తన విద్యనే ఉపాధిగా మార్చుకుంది మనీషా. ఇటీవల మంత్రి విడదల రజని పేరుతోనే గీసిన ఆమె చిత్రం పలువురి ప్రశంసలు అందుకుంది.
"కరోనా సమయంలో ఏం చేయాలో అర్థంకాక... నాకు ఒక ఆలోచన వచ్చింది. బొమ్మలు వేసి డబ్బులు సంపాదిస్తే బాగుంటుందనిపించింది. అలా ఒక ఆర్ట్‌కు రూ.200 నుంచి రూ.300 తీసుకుని వేయడం ప్రారంభించాను. అలా ప్రాక్టీస్ చేస్తూ చిన్న వ్యాపారం నడుపుతున్నాను. మొదట్లో నేను కేవలం పెన్సిల్ ఆర్టే వేసేదానిని. ఇప్పుడు చార్కోల్ ఆర్ట్, పెన్సిల్ ఆర్ట్, నేమ్ ఆర్ట్, స్ట్రింగ్ ఆర్ట్ కూడా వేస్తాను."- మనీషా
ఇవీ చదవండి: