ETV Bharat / state

న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్ ఎదుట యువతి నిరసన - kanigiri city latest news

అదనపు కట్నం కోసం ఆ యువతికి అత్తగారింట్లో వేధింపులు ఎదురయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ పరిస్థితులతో తీవ్ర ఆవేదన గురైన బాధితురాలు... తనకు న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్ ఎదుట నిరసనకు దిగింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగింది.

Young woman protest in front of police station

author img

By

Published : Oct 6, 2020, 8:44 AM IST

వరకట్న వేధింపులను తట్టుకోలేక ఓ మహిళ పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించిన ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో చోటు చేసుకుంది. పట్టణంలోని బాదుల్లా వారి వీధిలో నివాసముంటున్న షేక్ హుస్సేన్​కు అదే వీధికి చెందిన షాపిన్​కు 2019 నవంబర్​లో వివాహం జరిగింది. ఆ సమయంలో కట్నంగా హుస్సేన్​కు రూ.50 వేల నగదు, ఉంగరం, మరికొన్ని వస్తువులను తమ కుటుంబ సభ్యులు ఇచ్చారని బాధితురాలు వెల్లడించింది. సంసారం కొద్ది రోజులపాటు సజావుగానే సాగిందని... తాజాగా అదనపు కట్నం తీసుకురావాలంటూ హుస్సేన్, అతని కుటుంబ సభ్యులు తరచూ వేధిస్తున్నారని షాపిన్ ఆవేదన వ్యక్తం చేసింది. పలుమార్లు శారీరకంగా, మానసికంగా తనను హింసించారని ఆరోపించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆరోపిస్తూ షాపిన్ సోమవారం పోలీసు స్టేషన్​ ఎదుట బైఠాయించింది. యువతికి కనిగిరి ఐద్వా నాయకులు మద్దతుగా నిలిచారు.

కనిగిరి ఎస్సై రామి రెడ్డి భాదితురాలిని పిలిపించి మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆ యువతి ఇంటికి వెళ్లిపోయింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.