Rape attempt: ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలంలోని రాళ్లపల్లి గ్రామానికి ట్యాప్ టీం అంటూ సర్వే పేరుతో ఓ యువకుడు, యువతి వచ్చారు. వారు గ్రామ సచివాలయానికి వెళ్లారు. యువతి సచివాలయంలో సర్వే నిర్వహిస్తుండగా యువకుడు పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వెళ్లాడు. అంగన్వాడీ కేంద్రంలో ఒంటరిగా ఆయా కనిపించింది. దీంతో మాట కలిపిన యువకుడు నేను అంగన్వాడీలకు పై అధికారినని.. నీకు ప్రమోషన్ ఇస్తున్నానని, అంతేకాక జీతం కూడా రూ.9 వేల వరకు పెంచుతానని ఆయాకు మాయ మాటలు చెప్పి చేయి పట్టుకుని అత్యాచారానికి ప్రయత్నించాడు. దీంతో ప్రతిఘటించిన ఆయా పెద్దగా కేకలు వేసింది. కేకలు విన్న గ్రామస్థులు ఒక్కసారిగా ఆ కేంద్రం వద్దకు చేరుకోవడంతో యువకుడు అక్కడి నుంచి ఉడాయించాడు.
వెంటనే సచివాలయంలో యువకుడితో కలిసి వచ్చిన మహిళను, వారు వచ్చిన కారును గ్రామస్థులు అడ్డగించారు. వారి గుర్తింపు కార్డులను చూపాలని గ్రామస్తులు అడగ్గా వారి వద్ద ఏమీ లేకపోవడంతో వారిని ఆమెను నిర్బంధించారు. యువకుడితో వచ్చిన మహిళని యువకుని వివరాలు అడగ్గా అతని పేరు అమీర్ భాష అని.. నంద్యాల పట్టణానికి చెందిన యువకుడని తెలిపింది. అనంతరం పై అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి పోలీసులను సంప్రదించారు. ఆయా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.
ఇవీ చదవండి: