ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో తొలి బ్లాక్ ఫంగస్ మరణం - prakasham district corona cases

ప్రకాశం జిల్లాలో తొలి బ్లాక్ ఫంగస్ మరణం నమోదైంది. చీరాల మండలంలోని పేరాలకు చెందిన ఓ వ్యక్తి ఈ వ్యాధి కారణంగా హైదరాబాద్​లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

young man died with black fungus disease in chirala
ప్రకాశం జిల్లాలో తొలి బ్లాక్ ఫంగస్ మరణం
author img

By

Published : May 17, 2021, 7:39 PM IST

ప్రకాశం జిల్లా చీరాల మండలం పేరాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకడంతో చికిత్స నిమిత్తం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా.. అనారోగ్యానికి గురయ్యాడు. పరీక్షించిన వైద్యులు బాధితుడికి బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకినట్లు నిర్ధరించారు.

దీంతో మెరుగైన వైద్యం కోసం బాధితుడిని హైదరాబాద్​కు తరలించారు. శస్త్ర చికిత్స చేసి దవడను తొలగించిన వైద్యులు.. వెంటిలేటర్​పై ఉంచారు. ఈ క్రమంలో ఆరోగ్యం మరింత విషమించి సోమవారం ఉదయం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటికి ఆసరాగా ఉన్న కొడుకును కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని మృతుడి తల్లి కన్నీటిపర్యంతమయ్యారు.

ఇవీచదవండి.

విషాదం: రోడ్డు ప్రమాదంలో కరోనా బాధితురాలు మృతి

నారదా కుంభకోణం కేసులో ఆ నలుగురికీ బెయిల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.