ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ జలాశయంలో కాలు జారి పడి ఓ యువతి మృతి చెందింది. మార్కాపురం సుందరయ్య కాలనీకి చెందిన గాలి ముత్తు కుమారి(22) స్థానిక కందుల ఓబుల్ రెడ్డి ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం ఒంగోలులో ఓ కార్యక్రమానికి హాజరై.. అక్కడి నుంచి స్నేహితులతో కలసి గుండ్లకమ్మ జలాశయ సందర్శనకు వెళ్లింది. మరో యువతితో కలిసి కుమారి సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు జలాశయంలోకి పడిపోయింది. ఈత రానందున నీటిలోనే ప్రాణాలు విడిచింది. అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పాండురంగారావు తెలిపారు.
సెల్ఫీ సరదా... ఓ యువతి ప్రాణం తీసింది - photo
సెల్ఫీ సరదా ఓ యువతి ప్రాణం తీసింది. స్వీయచిత్రం తీసుకునేందుకు జలాశయం వద్దకు వెళ్లగా కాలు జారి నీటిలో పడి మృతి చెందింది.
ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ జలాశయంలో కాలు జారి పడి ఓ యువతి మృతి చెందింది. మార్కాపురం సుందరయ్య కాలనీకి చెందిన గాలి ముత్తు కుమారి(22) స్థానిక కందుల ఓబుల్ రెడ్డి ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం ఒంగోలులో ఓ కార్యక్రమానికి హాజరై.. అక్కడి నుంచి స్నేహితులతో కలసి గుండ్లకమ్మ జలాశయ సందర్శనకు వెళ్లింది. మరో యువతితో కలిసి కుమారి సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు జలాశయంలోకి పడిపోయింది. ఈత రానందున నీటిలోనే ప్రాణాలు విడిచింది. అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పాండురంగారావు తెలిపారు.
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : సంక్షేమం.. అభివృద్ధి రెండు కళ్ళుగా రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు చూశారని.. వ్యతిరేకపవనాలు విచినా ప్రకాశంజిల్లా చీరాల లో తెదేపా విజయం సాధించిందని... చీరాలలో రాక్షసపాలనకు ప్రజలు చమరగితం పాడారని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు.. చీరాల లో తెదేపా ఎమ్మెల్యే గా కరణం బలరామకృష్ణమూర్తి గెలుపొందిన సందర్భంగా కార్యకర్తలు, నాయకులు ఆత్మీయ సమావేశం నిర్మవహించారు.. కార్యక్రమంలో పోతుల సునీతతో పాటు ఎమ్మెల్యే గా ఎన్నికైన కరణం బలరాం, కరణం వెంకటేష్, మాజీమంత్రి పాలేటి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ పోతుల సునిత మాట్లాడుతూ చీరాలలో గత పదేళ్లుగా ప్రత్యేకపరిస్దితుల్లో పాలన జరిగిందని దానికి ఓటర్లు ముగింపు పలికి తెదేపా తరుపున బరిలో నిలిచిన కరణం బలరాం ను గెలిపించారని అన్నారు. తెదేపా యువనాయకుడు కరణం వెంకటేష్ మాట్లాడుతూ చీరాలలో తెదేపా విజయం వెనుక కార్యకర్తల ఉన్నారని... ప్రతిఒక్కరూ తామే అభ్యర్థి అనుకుని బలరాం ను గెలిపించారని చేప్పారు. ఎమ్మెల్యే గా ఎన్నికైన కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ కొన్ని ప్రత్యేకమైన పరిస్దితుల్లో చీరాల వచ్చానని తనను గెలిపించిన చీరాల నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు చేప్పారు... భూమి గుండ్రంగా ఉందన్నట్లు.. తన రాజకీయ జీవితం చీరాల లొనే ప్రారంభమయిందని.. ఎనో పదవులు అలంకరించానని తిరిగి చీరాల ఎమ్మెల్యేగా అవ్వటం తన అదృష్టమని బలరాం చెప్పారు... చీరాల పరిస్దితి తనకు తెలుసునని ప్రతిఒక్క కార్యకర్తకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.. నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరిస్తామని బలరాం చేప్పారు... సభకు నియోజకవర్గంలోని తెదేపా శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Body:బైట్ : 1: పోతుల సునీత - ఎమ్మెల్సీ.
బైట్ : 2 : కరణం వెంకటేష్- తెదేపా యువ నాయకులు.
బైట్ : 3 : కరణం బలరామకృష్ణమూర్తి- తెదేపా ఎమ్మెల్యే,చీరాల.
Conclusion:కె.నాగరాజు, చీరాల,ప్రకాశంజిల్లా, కిట్ నెంబర్ : 748