ప్రకాశం జిల్లా ఒంగోలులో వైకాపా కార్యకర్తల సమావేశం జరిగింది. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో వైకాపాకు మంచి ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ.. జిల్లా పరిషత్తుతో పాటు అన్ని మండల పరిషత్తులు, పంచాయితీలు, మున్సిపాలిటీలు గెలిచేలా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. పార్టీ సమన్వయకర్త ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ కార్యకర్త సమన్వయంతో పని చేయాలని కోరారు. మహిళా దినోత్సవం సందర్భంగా వైకాపా మహిళా విభాగం ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: