YCP leaders land kabza in Prakasam District: ప్రకాశం జిల్లాలో భూ అక్రమార్కుల ఆగడాలు పేట్రేగిపోతున్నాయి. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. దానిని సొంతం చేసుకునేందుకు కబ్జాదారులు యత్నిస్తున్నారు. పశువుల బీళ్లుగా ఉన్న భూమిని సైతం అక్రమార్కులు వదలటంలేదు. ఆ భూములను తమ పేరుమీద ఆన్‌లైన్ చేసేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామానికి ఆనుకొని సర్వే నెంబర్ 29లో 190.5 ఎకరాల పశువుల బీడు ఉంది. ఈ భూమిని కాపాడుకునేందుకు గ్రామస్థులంతా కలిసి ఏడుగురిని ట్రస్టీగా ఏర్పాటు చేసి, వారి పేరుమీద పట్టా రాయించారు.
YCP Leaders Land Irregularities: ఇటీవల ఈ భూముల్లో నుంచి బెంగుళూరు-అమరావతి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చాయి. దీంతో కొంతమందికి ఈ భూములపై కన్ను పడింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు ఈ భూములను సొంతం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
ట్రస్టీగా ఉన్న వారి వారసుల్లో కొంతమందిని ఉసిగొల్పి, ఆన్‌లైన్ చేసేందుకు అధికారులమీద ఒత్తడి తెస్తున్నారు. ఆన్లైన్లో ఎక్కించిన తర్వాత.. తన పేరుమీద కొనుగోలు చేసుకునేందుకు అధికార పార్టీ నేత ప్రణాళికలు వేసుకున్నారు. మిగిలిన ట్రస్టీ వారసులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు.
"భూమి కనిపించిందా.. రాళ్లు పాతడమే".. ఇదీ వైసీపీ నాయకుల తీరు
Cattle Grazing Lands Kabza: దాదాపు మూడు, నాలుగు తరాల క్రితం ట్రస్టీ సభ్యుల వారసులు వందల్లో ఉన్నారు. అందులో కొద్ది మంది మాత్రం నెల్లూరు నాయకుల ప్రభావానికి లోనై, ఆన్‌లైన్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామస్థులు ఆక్రమణలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ట్రస్టీలకు వారసులుగా ఉన్నా.. భూములు మాత్రం ఊరందరిదని, వాటిలో తమకు హక్కు లేదని, అక్రమంగా విక్రయానికి ప్రయత్నిస్తే అడ్డుకుంటామని పేర్కొంటున్నారు. అధికారులు ఈ అక్రమాలను అడ్డుకొని, భూమిని కాపాడాలని కోరుతున్నారు.
"1956 సంవత్సరం వరకు ఇది మా గ్రామస్థులందరి ఉమ్మడి ఆస్తి. భూ ఆక్రమణలు జరుగుతాయి అనే ఉద్దేశం మా పూర్వీకులు అంతా కలిసి.. ఈ భూమిని కాపాడుకునేందుకు ఏడుగురిని ట్రస్టీగా ఏర్పాటు చేసి, వారి పేరుమీద పట్టా రాయించారు. ఇటీవల ఈ భూముల్లో నుంచి బెంగుళూరు-అమరావతి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చాయి. దీంతో కొంతమందికి ఈ భూములపై కన్ను పడింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు ఈ భూములను సొంతం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ట్రస్టీగా ఉన్న వారి వారుసుల్లో కొంతమందిని ఉసిగొల్పి, ఆన్‌లైన్ చేసేందుకు అధికారులమీద ఒత్తడి తెస్తున్నారు. ఆన్లైన్లో ఎక్కించిన తర్వాత.. తన పేరుమీద కొనుగోలు చేసుకునేందుకు అధికార పార్టీ నేత ప్రణాళికలు వేసుకున్నారు. అధికారులు ఈ అక్రమాలను అడ్డుకొని, భూమిని కాపాడాలని కోరుతున్నాం." - గ్రామస్థుల ఆవేదన