ETV Bharat / state

అర్ధరాత్రి ఉద్రిక్తత: వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ

దివంగత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేస్తానని ఓ వర్గం.. అస్సలు వేయడానికి వీల్లేదని మరో వర్గం. ఇలా వైకాపా నాయకుల మధ్య జరిగిన ఘర్షణ రాత్రంగా ఉద్రిక్తతకు కారణమైంది. చివరకు పోలీసులు పహరా కాసేవరకూ వెళ్లింది.

YCP leaders clash for YSR statue at Mundlamoor Mandal in Prakham

author img

By

Published : May 31, 2020, 10:23 PM IST

Updated : Jun 1, 2020, 12:13 PM IST

వైకాపా పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండల కేంద్రంలో... వేడుక నిర్వహించారు. రైతుభరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఇంతవరకూ బాగానే ఉంది. మండలంలోని పార్టీ శ్రేణుల్లో.. రెండో వర్గానికి వైకాపా ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్... వేడుకలకు హాజరుకాలేదు. ఆయన ముఖ్యమంత్రి జగన్ తో కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉన్న కారణంగా.. ఆయన సోదరుడి చేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేయించాలని భావించారు. ఆ తర్వాత రైతుభరోసా కేంద్రాన్ని ప్రారంభించాలని అనుకున్నారు.

కానీ... మండల కేంద్రంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాన్ని తాము సొంతంగా ఏర్పాటు చేసుకున్నామని... పూలమాలు వేయడానికి వీలు లేదని కన్వీనర్ చెప్పడం.. ఘర్షణకు కారణమైంది. ఫలితంగా ముండ్లమూరు గ్రామంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పూల మాలలు వేయడానికి పట్టుపట్టిన ఎమ్మెల్యే సోదరుడిని ఆపేందుకు... కన్వీనర్ వర్గం వారు విగ్రహం వద్ద కాపలగా కూర్చున్నారు. ఇలా శనివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు గ్రామంలో ఉత్కంఠ నెలకొంది. పోలీసులు వచ్చి ఇరు వర్గాలను శాంతిపచేశారు.

చివరికి.. రెండో వర్గానికి చెందిన కార్యకర్తలు కూడా వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే సోదరుడు సైతం బిజీగా ఉన్న కారణంగా.. కార్యకర్తలే వేడుక పూర్తి చేశారు.

ఇదీ చదవండి:

'రైతు భరోసా కేంద్రాలతో తీరిన అన్నదాతల కష్టాలు'

Last Updated : Jun 1, 2020, 12:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.