ప్రకాశం జిల్లా చీరాలలో వైకాపా నాయకుల మధ్య ఆధిపత్యపోరులో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆరోరోజు వైఎస్ఆర్ ఆసరా సంబరాలు వైభవంగా జరిగాయి. ఎమ్మెల్సీ పోతుల సునీత, మరో పక్క మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌లు పోటాపోటీగా చీరాలలో కార్యక్రమాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ పోతుల సునీత... చీరాల మండలం తోటవారిపాలెం వీవర్స్ కాలనీ వద్ద నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో పట్టణ ప్రధాన వీధుల్లో వైకాపా నాయకులు, కార్యకర్తల బైక్ ర్యాలీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలప్తె పోటీ పరీక్షలు, క్రీడా పోటీలు నిర్వహించారు.
ఇదీ చూడండి. 'సజ్జలకు మీడియా స్వేచ్ఛ గుర్తుకు రావడం పెద్ద విశేషం'