కరోనా మహమ్మరిని జయించి విధులకు హాజరైన ప్రకాశం జిల్లా యద్దనపూడి ఎస్ఐ వెంకటేశ్వర చౌదరిని పోలీసు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. కరోనా మహమ్మారిని జయించి తిరిగి విధులకు హాజరవ్వడంతో ఎస్ఐకి సిబ్బంది పూలు చల్లి, చప్పట్లతో స్వాగతం పలికారు. అనంతరం ఎస్ఐ వేంకటేశ్వర చౌదరితో కేకు కోయించారు. శాలువాతో సత్కరించారు. మండలంలోని పలువురు వైకాపా నాయకులు ఎస్ఐకి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇవీ చదవండి