ETV Bharat / state

Worst Roads in Minister adimulapu suresh Constituency మంత్రి ఆదిమూలపు సురేష్ ఇలాకాలో రోడ్ల దుస్థితి చూశారా..! ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 28, 2023, 3:20 PM IST

Worst Roads in Minister adimulapu suresh Constituency వైసీపీ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా కొనసాగుతున్న మంత్రి ఆదిమూలపు సురేష్​కు పార్టీలో పట్టు ఎక్కవే అన్న వినికిడి. అయితే, తన సొంత నియోజక వర్గం వచ్చేసరికి.. ప్రజల్లో పట్టు కోల్పుతున్నారనే వాదన వినిపిస్తోంది. నియోజకవర్గంలో పలు రహదారుల్లో ప్రయాణించాలంటే.. ప్రజలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇక వాహన యజమానులు పరిస్థితి చెప్పనక్కర్లేదన్నట్లుగా ఉంది. బండిని బయటకు తీస్తే,రిపేరు మోత.. రోడ్డను ఎక్కించకపోతే.. పూట గడవని దుస్థితి. రోడ్లను బాగుచేయించడంలో ఆదిమూలపు సురేష్ ఏమాత్రం శ్రద్ద కనబర్చలేదని.. ప్రజలు మండిపడున్నారు.

Worst_Rural_Roads_in_Yerragondapalem_Constituency

Worst Rural Roads in Yerragondapalem Constituency : మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం అది. మంత్రి ఐతే తమ గ్రామాలకు వెళ్ళే రోడ్ల స్థితిగతులు మారి తమ ప్రయాణ కష్టాలు తీరుతాయనుకున్నారు. కానీ నాలుగున్నరేళ్లు ఐనా తమ బతుకుల్లో మాత్రం ఏ మాత్రం మార్పు లేదని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Non Management of Roads in Prakasam District : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పెద్దారవీడు మండలం సుంకేసుల, కలనూతల, గుండంచర్ల గ్రామాలకు వెళ్ళే రహదారి అస్తవ్యస్తంగా మారింది. ఆ గ్రామాలలో సుమారు ఆరు వేల మంది జనాభా ఉంటారు. నిత్యం ఆ రహదారి పై వివిధ పనుల నిమిత్తం వేల మంది ప్రయాణం సాగిస్తుంటారు. కొండ కు అవతలి వైపు ఉండే గ్రామాల నుంచి ఆటోలు, కార్లు, బైక్​లపై ప్రయాణం చేస్తుంటారు. అసలే కొండలు పైగా రహదారిపై భారీ గోతులు, కంకర రాళ్ళు ఉండడంతో ప్రయాణం నరకంగా మారి వాహనాలు సైతం దెబ్బతింటున్నాయని వాహనదారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

Kuchipudi to Avanigadda Main Road Completely Destroyed: అడుగుకో గుంత.. పట్టించుకోని అధికారులు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం

People Fire on Minister Adimulapu Suresh : గర్భిణీ స్త్రీలు, అనారోగ్యం పాలైన వారిని వైద్యశాలకు తరలించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామీణ ప్రజలు వాపోయారు. పలు సార్లు మంత్రి ఆదిమూలపు సురేష్ ఇక్కడి గ్రామాలకు వచ్చినప్పుడు రోడ్ల సమస్య ఆయన దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి నాలుగున్న సంవత్సరాలు అయిన కనీసం మంత్రి స్థాయిలో ఒక్క సారి కూడా రోడ్డు మరమ్మతులు చేయించలేని స్థితిలో ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు.

Terrible Roads in Rural Villages : వర్షం పడితే.. రహదారిన వెళ్ళలేక పనులు మానుకోవాల్సిందే : ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చినా.. ఆ వచ్చే డబ్బులు రిపేర్లు, టైర్లకే సరిపోవడం లేదని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. ఒక్కో ఆటోకు కొంత నగదు వెచ్చించి పలు సార్లు సొంతంగా గుంతలు పుడ్చుకున్నామని తెలిపారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో నాలుగు, ఐదు సార్లు రోడ్లకు మరమ్మతులు చేపడితే.. ఇప్పుడు కనీసం ఆ వైపు చూసే నాథుడే కరువయ్యారని గ్రామీణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడితే ఆ రహదారిన వెళ్ళలేక పనులు సైతం మానుకొని ఇళ్ళ వద్దే ఉంటున్నామని వారు తెలిపారు.

Roads Damage in Gudivada: నోరు తెరిచి జగన్‌ను నిధులు అడగలేదా..? అడిగినా ఇవ్వలేదా..!

స్థానిక ప్రజల డిమాండ్ : "ఈ రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాన వస్తే రాళ్లు తేలుతున్నాయి. రోడ్డు కోసుకుపోయింది. మా ఎమ్మెల్యే, మంత్రి ఆదిమూలపు సురేష్ మా బాధలను చూసి రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తున్నాము."- స్థానిక ప్రజలు

YSRCP Flag in Road Pothole: 'ఇదీ మా ఘనతే..!' రోడ్డుపై ప్రమాదకరంగా గుంత.. పార్టీ జెండాతో వాహనదారులకు హెచ్చరిక

Worst Roads in Minister adimulapu suresh Constituency మంత్రి ఆదిమూలపు సురేష్ ఇలాకాలో రోడ్ల దుస్థితి చూశారా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.