ETV Bharat / state

నా ఉద్యోగం నాకు ఇప్పించడి... ఓ మహిళ వేడుకోలు - prakasam district aagan wadi teacher problem

పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులతో తన విధిరాత మారింది. జీవితాంతం తోడుంటాడనుకున్న భర్త మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. బతుకు భారమైన ఆమెకు అంగన్వాడీ ఉద్యోగం ఇచ్చింది ప్రభుత్వం. కానీ.. తోటి ఉద్యోగుల ఫిర్యాదుతో ఆ ఆసరా లేకుండాపోయి రోడ్డుపై పడింది. తన ఉద్యోగం తనకు ఇప్పించాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది.

నా ఉద్యోగం నాకు ఇప్పించడి
author img

By

Published : Nov 19, 2019, 10:48 AM IST

ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కల్లూరుకు చెందిన కళావతికి దోర్నాల మండలం బొమ్మలపాలెంకు చెందిన వ్యక్తితో 30 సంవత్సరాల క్రితం వివాహమైంది. 1992వ సంవత్సరంలో మావోయిస్టులు పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో గొర్రెలు కాచుకుంటున్న కళావతి భర్త నుదిటికి బుల్లెట్ తగిలి మృతి చెందాడు. పోలీసులు అప్పుడు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసినా బయటకు పొక్కింది. భర్త చనిపోయి కుటుంబ పోషణ కష్టంగా ఉందని.. ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కళావతి ప్రభుత్వాన్ని వేడుకుంది. కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరిగింది. ఎట్టకేలకు 2013లో కల్లూరులో అంగన్వాడీ ఉధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది. ఆరు నెలలు చేసిందో లేదో 9వ తరగతి విద్యార్హతే ఉందని... కొంతమంది కోర్టులో కేసులు వేయగా ఆమెను తొలగించారు. అప్పటినుంచి తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలంటూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. కుటుంబం నడవడం కష్టంగా ఉందని తాను పదో తరగతి ధ్రువ పత్రాలు అందించినా... కోర్టుకు మాత్రం 9 తరగతి పత్రాలు అందించి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని వాపోతుంది కళావతి.

ఉద్యోగంకోసం తిరుగుతున్న కళావతి

ఇదీ చూడండి

కడలి కల్లోలానికి 42 ఏళ్లు.. బాధితుల్లో ఇంకా కన్నీళ్లు

Intro:AP_ONG_13_18_LADY_FIGHT_FOR_JOB_PKG_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
................................................................................
పోలీసులకు మావోయిస్టులకు జరిగిన కాల్పుల్లో గొర్రెలు కాచుకుంటున్న భర్త చనిపోయాడు....తోడుగా ఉండాల్సిన భర్త చనిపోయాడు ఆసరాగా ఉండమని ప్రభుత్వాన్ని అర్ధించింది. అంగన్వాడీ లో ఉద్యోగం ఇప్పించాలని ప్రభుత్వంపై పోరాడింది. ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీ టీచర్ గా ఉద్యోగం ఇచ్చింది. ఆరు నెలలు ఉద్యోగం చేసిందో లేదో విద్యార్హత లేదంటూ తప్పించింది. అప్పటి నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్న...కలెక్టర్ కి విన్నవించుకున్న మొర అలకించడం లేదంటూ ఆ మహిళ వాపోతోంది. ఇక నైనా న్యాయం చేయండంటూ ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ వద్ద ధీనంగా అధికారులను వేడుకుంటుంది.....

వాయిస్ ఓవర్: ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కల్లూరుకు చెందిన కళావతి కి దోర్నాల మండలం బొమ్మలపాలెంకు చెందిన వ్యక్తితో 30 సంవత్సరాల క్రితం వివాహమైంది. 1992 వ సంవత్సరంలో మావోయిస్టులు పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో గొర్రెలు కాచుకుంటున్న కళావతి భర్త నుదిటికి బుల్లెట్ తగలడంతో ఆయన మరణించాడు. పోలీసులు అప్పుడు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసినా బయటకు పొక్కింది. భర్త చనిపోయి కుటుంభ పోషణ కష్టంగా ఉంది ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంది. కాల్లరిగేలా అధికారుల చుట్టూ తిరిగింది. ఎట్టకేలకు 2013 లో కల్లూరులో అంగన్వాడీ ఉధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది. ఆరు నెలలు చేసిందో లేదో 9 వ తరగతి విద్యార్హత ఉందని ...కొంత మంది కోర్టులో కేసులు వేశారంటూ ఆమెను తొలగించారు. అప్పటి నుంచి తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలంటూ అధికారుల చుట్టూ ప్రదర్శనలు చేస్తోంది. కుటుంభం నడవడం కష్టంగా ఉందని వాపోయింది. తాను పదవ తరగతి ధ్రువ పత్రాలు అందించిన కోర్టుకు మాత్రం 9 తరగతి పత్రాలు అందించి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించింది .సంబంధిత పీడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితురాలు తెలియజేజింది....బైట్
1. కళావతి, బాధితురాలు.

Body:ongole

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.