ETV Bharat / state

ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తాం: నారా లోకేశ్ - prakasam district latest news

తుపానుకు రైతులు తీవ్రంగా నష్టపోతే.. ముఖ్యమంత్రి జగన్ కనీసం పట్టించుకోవటం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 30వేల రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

nara lokesh
nara lokesh
author img

By

Published : Dec 5, 2020, 6:20 PM IST

రైతుల సమస్యలను ప్రభుత్వం తీర్చే వరకు తెదేపా తరఫున పోరాడతామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కరోనా నిబంధనలు తొలగిపోయాక చలో అమరావతికి పిలుపునిస్తామని, ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని చెప్పారు. నివర్ తుపానుతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి... రైతులను పరామర్శించడానికి ప్రకాశం జిల్లాలో లోకేశ్ పర్యటించారు. కారంచేడులో రైతులతో ముఖాముఖి నిర్వహించారు.

ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రావడం లేదని... తుపానుకు రైతులు తీవ్రంగా నష్టపోతే కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 30వేల రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 15 లక్షల కౌలు రైతులను ఆదుకోవాలని అన్నారు. అలాగే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. విద్యుత్​ మీటర్లు అమర్చితే అధికార పార్టీ నేతలు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి వస్తుందన్నారు.

అనంతరం కారంచేడు మండలం తెమిడితపాడు గ్రామం వద్ద మిరప పొలాలను పరిశీలించ్చారు. మిర్చి పంట పూర్తిగా పాడైపోయినా అధికారులు కనీసం పరిశీలించలేదని లోకేశ్​ ఎదుట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధైర్యపడవద్దని.. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని వారికి లోకేశ్ భరోసా ఇచ్చారు. ఆ తరువాత దగ్గుపాడులో పొలాల్లోకి దిగి పంటలను పరిశీలించారు.

ఇదీ చదవండి

'రైతులను ప్రభుత్వం ఆదుకోకుంటే.. ఈ నెల 7న నిరసన'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.