Water Release from Rallapadu project: ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి ప్రకాశం జిల్లా రాళ్లపాడు జలాశయానికి వరద ప్రవాహం వస్తోంది. వరద పెరగడంతో జలాశయం 5 గేట్లను ఎత్తి అధికారులు.. దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 37,169 క్యూసెక్కుల వరద ప్రహహం వస్తుండగా.. ఔట్‌ఫ్లో 40,325 క్యూసెక్కులుగా ఉంది.
ప్రమాదంలో పామూరు పాత చెరవు...
Rains in Prakasam district: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పామూరు వద్ద పాత చెరువు తెగిపోయే ప్రమాదం ఉంది. దాంతో గ్రామస్థులు భయాందోళనకు గురువుతున్నారు. అలాగే జిల్లాలోని పలు వాగులకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. బొట్లగూడూరు సమీపంలో నేరెళ్లవాగు ఉద్ధృతి దృష్ట్యా.. పామూరు-కందుకూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పి.సి.పల్లి మండలం బట్టుపల్లి వద్ద పాలేటిపల్లి వాగు, పామూరు మండలం రేణుమడుగు వద్ద మన్నేరు వాగు, రాచర్ల మండలం పలకవీడు వద్ద ఉప్పువాగు ఉద్ధృతి పెరిగింది.
నిండుకుండలా మోపాడు రిజర్వాయర్
పామూరు మండలంలోని మోపాడు రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 29 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 27 అడుగుల వరకు చేరింది. ముందస్తు చర్యల్లో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. ఏ ప్రభుత్వ అధికారులు తమను కన్నెతైనా చూడటం లేదని స్థానికులు వాపోయారు.
ఇదీ చదవండి