అనుమానస్పద స్థితిలో గ్రామ వాలంటీర్ మృతి ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం బోడపాడు సమీపంలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడు దొనకొండ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ బాలయ్యగా పోలీసులు గుర్తించారు. ఎవరో నగదు ఇవ్వాల్సి ఉండగా మార్కాపురం వచ్చినట్లు కుటుంబీకులు తెలిపారు. ఎవరైనా హత్య చేసి ఉంటారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: రామాపురం బీచ్లో గుంటూరు వాసి మృతి