నేనే కలెక్టర్, పోలీస్, పంచాయతీ సెక్రటరీ.. ఇలా కావాల్సిన గెటప్ల్లోకి వెళ్లిపోతాడు. ఎందుకంటారా? మోసాలకు ఉన్నత అధికారుల పదవులను అడ్డుపెట్టుకునేందుకు. అతడి పేరు అఖిల్. గ్రామ వాలంటీర్‌గా పని చేస్తున్నాడు. ప్రకాశం జిల్లా కురిచేడులో ఎస్సై ఎన్నికల విధుల్లో ఉన్న సమయంలో.. ఆ స్టేషన్‌కు వెళ్లి.. ఎస్సై అవతారమెత్తాడు. చివరకు దొరికి.. జైలు పాలయ్యాడు.
ప్రకాశం జిల్లా కురిచేడుకు చెందిన అఖిల్ అనే యువకుడు వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గతంలో రాజమండ్రిలో ఓ మహిళను తీసుకువెళ్లి బంగారు షాపు యజమానికి జాయింట్ కలెక్టర్‌కు కాబోయే భార్య అని పరిచయం చేశాడు. ఆమెకు అప్పుగా ఆరు లక్షల రూపాయల బంగారాన్ని అప్పుగా ఇప్పించాడు. ఇంకేం.. యజమానికి టోకరా వేశాడు. షాపు యజమాని చాకచక్యంగా వ్యవహరించి.. అఖిల్‌ను అతడితో వచ్చిన మహిళను పోలీసులకు పట్టించాడు.
కొన్ని రోజుల తర్వాత.. కురిచేడులో గ్రామంలోని చాలామందికి పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి.. రూ.2.5 లక్షల వరకు దోచుకున్నాడు. అయితే ఈ ఘటన వెలుగులోకి రావడంతో రాజకీయ నాయకుల అండదండలతో బయటపడ్డాడు. వాలంటీర్ పోస్ట్ కూడా పోకుండా మేనేజ్ చేసుకున్నాడు. ఇటీవలే అఖిల్‌కు కురిచేడు ఎస్సై సీటుపై కన్ను పడినట్టుంది.. ఎస్సై, సిబ్బంది లేని సమయం చూసి.. సీట్లో కూర్చొని ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. ఈ విషయంతోపాటు గతంలోని చరిత్ర కూడా తెలిసిన పోలీసులు.. అఖిల్‌ను అరెస్టు చేశారు.
ఇటీవల పింఛనుదారుల నుంచి బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు వేయించుకుని సొమ్ము దోచేసినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు.. ఒక్కసారి ఎమ్మార్వోగానూ.. అవతారమెత్తాడు. అఖిల్‌పై రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: 'కరోనాపై కలిసి పోరాడదాం- లాక్డౌన్ చివరి అస్త్రమే'