ETV Bharat / state

'వెలిగొండ ప్రాజెక్ట్ పనులు అక్టోబర్ 31 నాటికి పూర్తి చేయాలి' - velugonda project works should be completed by October 31

ప్రకాశం జిల్లా కంభం మండలం వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి టన్నెల్ పనులు అక్టోబర్ 31 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు.

praksam district
వెలిగొండ ప్రాజెక్ట్ పనులు అక్టోబర్31 నాటికి పూర్తి చేయాలి
author img

By

Published : Jul 10, 2020, 9:04 PM IST

ప్రకాశం జిల్లా కంభం మండలంలోని వెలుగొండ ప్రాజెక్టు కాకర్ల డ్యామ్, ఈస్టరన్ మెయిన్ కెనాల్ పనులను, సాయిరామ్ నగర్ లో కెనాల్ కు అవసరమైన భూములను జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జాయింట్ కలెక్టర్ జె.వెంకటమురళి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పరిశీలించారు. తురిమెళ్లలోని వెలిగొండ ప్రాజెక్టు ఆఫీసులో జిల్లా కలెక్టర్ భాస్కర్ వెలిగొండ ప్రాజెక్టు ఇంజినీర్లు, భూసేకరణ అధికారులు, రెవెన్యూ అధికారులతో నిర్మాణ పనులు, భూసేకరణ పునరావాస కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.

వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి టన్నెల్​ను ముఖ్యమంత్రి చేతుల మీదగా ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయటానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్ట్​ను త్వరితగతిన పూర్తి చేయటానికి ముఖ్యమంత్రి అవసరమైన నిధులు మంజూరు చేశారన్నారు. ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమైనందున అక్టోబరు నెలాఖరు నాటికి నీటిని విడుదల చేయడానికి ప్రణాళికలు తయారు చేయాలని తెలిపారు. ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాస సౌకర్యాలు కల్పించాలని... వాటిని భవిష్యత్తులో అభివృద్ధి చేసుకొనే విధంగా రూపకల్పన చేయాలని కలెక్టర్ గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి మళ్లీ లాక్​డౌన్.. కిటకిటలాడిన దుకాణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.