చిన్నపాటి వర్షానికే ప్రకాశం జిల్లా కనిగిరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే చాలు ప్రభుత్వ కార్యాలయాకు వెళ్లాలంటే సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. రహదారులు గుంతలు పడి అధ్వాన్నంగా మారినా.. గుంతల్లో వర్షపు నీరు చేరి ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలంటూ.. రహదారిపై పడిన గుంతల్లో వరి నాట్లు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఐద్వా కార్యకర్తలు.. నేతృత్వం వహించారు. కనిగిరి తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న గుంతల్లో వర్షపు నీరు చేరి.. చెరువులను తలపిస్తున్నాయని స్థానికులు వాపోయారు.
తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఒకే దగ్గర ఉన్న కారణంగా.. రహదారి నిత్యం రద్దీగా ఉంటుందనీ.. వర్షాకాలంలో ఈ రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. గుంతల్లో మట్టితోనైనా పూడ్చలేదనీ స్థానికులు వాపోయారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించాలనే.. వినూత్నంగా నిరసన తెలిపినట్లు ఐద్వా ఆధ్వర్యంలో నిరసన చేపట్టినట్లు స్థానికులు వివరించారు.
ఇదీ చదవండి: