ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో గత కొన్ని రోజులుగా తీవ్ర ఎండ, ఉక్కపోతలకు అల్లాడుతున్న ప్రజలు... నేడు కురిసిన వర్షానికి సేద తీరారు. మేఘాలు దట్టంగా కమ్ముకుని...ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. రహదారులన్నీ వర్షపు నీటితో తడిశాయి. గత మూడు రోజుల నుంచి ఉదయం ఎండ... సాయంత్రం చల్ల బడుతుండటం తప్ప వర్షం కురవలేదు. ఇవాళ ఒక్కసారిగా వర్షం కురవటంతో ప్రజలు ఉపశమనం పొందారు.
ఇవి కూడా చదవండి: