ప్రకాశం జిల్లా చిన గంజాం మండలం పల్లెపాలెం సముద్ర తీరం వద్ద 80 వలలను గుర్తుతెలియని దుండగులు తగులబెట్టారు. దహనమైన వలల విలువ రూ.30 లక్షల వరకు ఉంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. వలలు దహనం చేయడంతో తమ జీవనాధారం కోల్పోయామని మత్స్యకారులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: వాడరేవు వద్ద సముద్రంలో ఇద్దరు యువకుల గల్లంతు