ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్న దృష్ట్యా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ అద్దయ్య, అద్దంకి కమిషనర్ వీరాంజనేయులు, పంచాయతీ సిబ్బంది హాజరయ్యారు. ఇటీవల కాలంలో అద్దంకిలో వాటర్ ప్లాంట్ మూసివేయడంతో తాగునీటికి తీవ్రంగా ఇబ్బందిపడినట్లు ప్రజలు తెలిపారు. భవిష్యత్లో నీటి సమస్యలు రాకుండా పూడిక తీసేందుకు అధికారులు గుళ్ళకమ్మను సందర్శించారు. తక్షణమే మట్టి పూడికను తీసి తాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.
ఇదీ చూడండి:శాసనసభలో గందరగోళం.. కరకట్ట నిర్మాణాలపై చర్చ