ETV Bharat / state

నవయుగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా యోధులకు సత్కారం - Navayuga Foundation latest news

కరోనా సమయంలో సేవలందించిన పాత్రికేయులు, పోలీసులను నవయుగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సత్కరించారు. కరోనా కాలంలో సేవలందించిన వారిని గుర్తించి సత్కరించటం అభినందనీయమని ఆడిషనల్ ఎస్పీ రవిచంద్ర పేర్కొన్నారు.

Tribute to Corona warriors under the auspices of the Navayuga Foundation
నవయుగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా యోధులకు సత్కారం
author img

By

Published : Oct 26, 2020, 3:30 AM IST

కరోనా కష్టకాలంలో విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి సేవలందించిన యోధులను ఒంగోలుకు చెందిన నవయుగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సత్కరించారు. పోలీసులు, పాత్రికేయులకు అవార్డులు అందజేశారు. విజయదశమి సందర్భంగా ఒంగోలు రెడ్​క్రాస్ భవనంలో ఈ కార్యక్రమం జరిగింది. లాక్​డౌన్ సమయంలో ప్రజలకు వార్తలు అందించడంతో పాటు కరోనా పట్ల అవగాహన కల్పించి, అప్రమత్తం చేసిన జర్నలిస్టుల సేవలు మరువలేనివని, పోలీసులు లాక్​డౌన్ అమలు చేయడంలో ఎంతో శ్రమించారని నవయుగ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మస్తాన్​చౌదరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆడిషనల్ ఎస్పీ రవిచంద్ర హాజరయ్యారు. కరోనా సమయంలో సేవలందించిన వారిని గుర్తించి సత్కరించటం అభినందనీయమని పేర్కొన్నారు.

ఇదీ చదవండీ... గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేతపై హైకోర్టు స్టే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.