ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. శనివారం వరకు చీరాలలో 1138కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. పట్టణంలో ఇంత ప్రమాదకర పరిస్థితి ఉన్నా... ప్రజలు ఏ మాత్రం పట్టనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
పట్టణంలో ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలు తెరుచుకునేందుకు అధికారులు నిబంధన విధించారు. స్థానికులు మాత్రం ప్రతి చిన్న పనికి ద్విచక్ర వాహనాలపై రోడ్డక్కుతున్నారు. ఫలితంగా.. ట్రాఫిక్ సమస్యలు సైతం తలెతుతున్నాయి.
ప్రజలు మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. అధికారులు జాగ్రత్తలు వివరిస్తున్నా... స్థానికులు మాత్రం కనీస జాగ్రత్తలు కూడా పాటించడం లేదు.
ఇదీ చదవండి: