ETV Bharat / state

TRAFFIC POLICE: శభాష్‌.. ట్రాఫిక్‌ పోలీస్‌ - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

TRAFFIC POLICE: ట్రాఫిక్‌ పోలీసుల దయాగుణం, సమయస్ఫూర్తి ఓ మూగజీవాన్ని రక్షించింది. రోడ్డుపై ఉన్న దూడ మీదినుంచి టిప్పర్‌ వెళ్లింది. సమీపంలో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించి ప్రథమ చికిత్స చేయించారు. ఈ ప్రకాశం జిల్లా ఒంగోలులో గద్దలగుంటలో జరిగింది.

traffic police saves a cow life in ongole
గాయపడిన దూడను రక్షించిన ట్రాఫిక్‌ పోలీసులు
author img

By

Published : Apr 28, 2022, 9:14 AM IST

Updated : Apr 28, 2022, 9:51 AM IST

మూగజీవాన్ని రక్షించిన ట్రాఫిక్​ పోలీసులు

TRAFFIC POLICE: ప్రకాశం జిల్లా ఒంగోలులో గద్దలగుంట సమీపంలో మంగళవారం రాత్రి ఓ టిప్పర్‌ రోడ్డుపై ఉన్న దూడ మీదినుంచి వెళ్లింది. దీంతో దాని కాళ్లు దెబ్బతిని రక్తస్రావమై మూలుగుతుండగా సమీపంలో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు. వెంటనే ఆ మూగజీవాన్ని రికవరీ వాహనంపై వేసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఇది చూసిన తల్లి ఆవు వాహనాన్ని వెంబడిస్తూ ఠాణాకు చేరింది. పోలీసులు వైద్యుడిని పిలిపించి దూడకు ప్రథమ చికిత్స చేయించారు. మళ్లీ బుధవారం ఉదయం సంతపేట పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లి పూర్తిస్థాయి చికిత్స అందించారు. అప్పుడు కూడా ఆవు తన పిల్లను ఓ కంట కనిపెడుతూనే వాహనం వెంట పరుగు తీసింది. దీంతో చికిత్స పూర్తయ్యాక పోలీసులు రెండింటినీ వాటి యజమానికి అప్పగించారు. ఒంగోలు నగర ట్రాఫిక్‌ పోలీసులు చూపిన ఈ చొరవను స్థానికులు అభినందించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో విద్యుత్ కోతలు.. ఆక్వా రైతుల ఆవేదన

Last Updated : Apr 28, 2022, 9:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.