Tractor Reverse Race in Prakasam: రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. పలు రకాల పోటీలతో పల్లెలన్నీ సందడిగా మారాయి. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం ఇనగల్లులో ట్రాక్టర్ రివర్స్ పోటీలు నిర్వహించారు. ట్రక్‌తో ఉన్న ట్రాక్టర్ను.. తక్కువ సమయంలో ఎక్కువ దూరం తీసుకెళ్లిన వారిని విజేతగా ప్రకటించారు.
ఇందులో మొదటి బహుమతి రూ. 5,116, రెండో బహుమతి రూ. 3,116, మూడో బహుమతి రూ. 2,116 గా నిర్ణయించారు. ఈ పోటీల్లో ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి 27 మంది డ్రైవర్లు పాల్గొన్నారు.
మొదటి బహుమతి గుంటూరు జిల్లా కకుమాను మండలం గర్లపాడుకు చెందిన మహేష్ దక్కించుకున్నారు. రెండో బహుమతి ప్రకాశం జిల్లా బోడవాడకు చెందిన బాలయ్య, మూడో బహుమతి పెదనందిపాడుకు చెందిన ప్రభుదాస్ గెలుచుకున్నారు.
ఇదీ చదవండి :