ప్రకాశం జిల్లా ఒంగోలు విన్నావారికోట వీధిలోని జీఎస్ఆర్ అపార్ట్మెంట్లో భారీ చోరీ జరిగింది. గ్రానైట్ వ్యాపారి మండవ మురళీకృష్ణ ఇంట్లో 60 సవర్ల బంగారం, రెండు కేజీల వెండి...విశ్రాంత ఎస్ఈ యానాదిరావు ఇంట్లో 60 సవర్ల బంగారం, ఐదు కేజీల వెండి అపహరణకు గురైంది.
కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని..మండవ మురళీకృష్ణ మేదరమెట్లలో ఉంటున్నారు. యనాదిరావు అమెరికా వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవటంతో దుండగులు చొరబడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని...కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.