రోజురోజుకూ పెరుగుతున్న కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపడుతోంది. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల్లో వివిధ శాఖల సిబ్బంది మూడో విడత ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. కరోనా కేసుల నేపథ్యంలో ప్రజలెవరూ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అధికారులంటున్నారు. సర్వేల్లో భాగంగా.. ప్రతి ఇంట్లో ఎవరైనా 50 ఏళ్ల వయసుకు మించిన వారు ఉన్నారా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. వేరే ప్రాంతం నుంచి ఎవరైనా వచ్చారా..లేదా ఇక్కడినుంచి ఎవరైనా వెళ్లారా అన్న విషయాన్నీ తెలుసుకుంటున్నారు.
ఇదీ చూడండి: