ప్రకాశం జిల్లా కంభం చెరువు కట్టపై తేరా తేజీ పండుగ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మెుహరం పండుగ తర్వాత ఈ పండుగ జరుపుకోనున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ ఆచారం గత 400 ఏళ్లుగా కొనసాగుతోందన్నారు. ఈ మహోత్సవానికి కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నట్లు స్పష్టం చేశారు. ఈ దర్గాను దర్శించి మెుక్కుకుంటే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. గత నాలుగు సంవత్సరాలుగా వట్టిపోయిన చెరువు జలకళ సంతరించుకోవటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీచదవండి