ETV Bharat / state

TDP Mahanadu : పసుపు పండుగకు... సర్వం సిద్ధం ! - tdp updates

తెలుగుదేశం పార్టీ 40 వసంతాల పండుగకు సర్వం సిద్ధమవుతోంది. పసుపు పండుగకు ఒంగోలు సర్వంగా సుందరంగా ముస్తాబవుతోంది. అతి పెద్ద వేదిక సహా, ఎక్కడా లోటు రాకుండా ఏర్పాట్లు చేయడంలో పార్టీ శ్రేణులు తలమునకలయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే కార్యకర్తలు, అభిమానులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా.. పెద్ద పండుగను తలపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

TDP Mahanadu
TDP Mahanadu
author img

By

Published : May 25, 2022, 5:05 AM IST

పసుపు పండుగకు... సర్వం సిద్ధం !

ఒంగోలు శివారు మండువవారిపాలెం వద్ద ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న తెదేపా మహానాడు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. తొలి రోజైన 27న ప్రతినిధుల సభ జరగనున్న ప్రాంగణంలో వేదిక, జర్మన్‌ హేంగర్‌ (షెడ్డు) ఏర్పాటు పూర్తయింది. ఎయిర్‌కూలర్ల ఏర్పాటు, మీడియా పాయింట్‌ పనులు కొనసాగుతున్నాయి. తొలిరోజు 12వేల మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండోరోజు ఈ సంఖ్యను పెంచనున్నారు. అలానే దాదాపు 500 మందికి పైగా నాయకులు కూర్చునేలా వేదికను సిద్ధం చేస్తున్నారు. 28న జరిగే బహిరంగ సభకు జర్మన్‌ షెడ్‌ను తీసివేస్తారా, అలానే ఉంచుతారా అనేది తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్‌ చిత్రాలతో ఏర్పాటుచేసే ఫొటో గ్యాలరీకి తుది మెరుగులు దిద్దుతున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ సినీ, రాజకీయ నేపథ్యం ఉన్న అరుదైన చిత్రాలను ఇక్కడ ప్రదర్శిస్తారు.

భారీగా తెదేపా శ్రేణులు వస్తున్నందున ఎటువంటి ఇబ్బందీ కలగకుండా భోజన ప్రాంగణం రూపుదిద్దుకుంది. మహానాడు ప్రాంగణంలో విద్యుత్తు వెలుగులు విరజిమ్మేలా లైట్లు, పార్టీ అధినాయకుల ఫొటోలతో భారీ కటౌట్లు ఏర్పాటుచేస్తున్నారు. నలువైపులా అందరికీ కనిపించేలా 30ఎంఎం ఎల్‌ఈడీ తెరల ఏర్పాటుకు సన్నద్ధం చేస్తున్నారు. ప్రాంగణానికి కాస్త దూరంగా ఒకవైపు బయో టాయిలెట్లు ఏర్పాటు చేశారు. మహానాడుకు.. చంద్రబాబు ఒక రోజు ముందే బయల్దేరి వెళ్తున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు తెదేపా జాతీయ కార్యాలయం నుంచి బైక్‌ ర్యాలీ ప్రారంభిస్తారు. అక్కడ నుంచి ఒంగోలుకు బయల్దేరి వెళ్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఒంగోలులో జరిగే పొలిట్‌బ్యూరో సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

రెండో రోజు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల్లో భాగంగా లక్షల మంది అభిమానుల సమక్షంలో మహానాడు జాతర నిర్వహించనున్నారు. ఇందుకోసం భారీ స్థాయిలో సభా వేదికలు ముస్తాబవుతున్నాయి. భారీ షెడ్లు, విద్యుత్ దీపాలంకరణలు, బ్యానర్లు, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎంతమంది వచ్చినా అందరికీ భోజనాలు సహా ఇతర ఏర్పాట్లన్నీ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను.... పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ... స్థానిక నేతలతో కలిసి పర్యవేక్షించారు. 40 వసంతాల పార్టీ పండుగను ఒంగోలులో నిర్వహిస్తుండటం పట్ల స్థానిక తెదేపా నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాలైన..... తెలుగు యువత, సాంకేతిక, ప్రొఫెషనల్‌ విభాగాలు... మహానాడు నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రక్తదాన శిబిరాల ఏర్పాటు, అతిథులకు సౌకర్యాల కల్పన..ఎజెండా ప్రకారం కార్యక్రమాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ పసుపు పండుగతో... పార్టీకి పునరుత్తేజాన్ని తీసుకురావాలని.... శ్రేణులు కృషి చేస్తున్నాయి.

ఇదీ చదవండి: ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. మహానాడుకు చీమలదండులా పోటెత్తుతారు: అచ్చెన్నాయుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.