ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో ఆరేళ్ల బాలుడి అపహరణ స్థానికంగా కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరు గంటల్లోనే బాలుడి ఆచూకీ కనుక్కోవటంతో అందరూ ఉపిరి పీల్చుకున్నారు. సీసీ టీవీ పుటేజ్, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు బాలుణ్ణి కిడ్నాప్ చేసిన వ్యక్తిని బురుజుపల్లి, ముళ్లపాడు గ్రామాల మధ్యన అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాలుణ్ణి తమ అధీనంలోకి తీసుకొని తల్లిందడ్రులకు అప్పగించారు. వేగంగా స్పందించి, అతి తక్కువ సమయంలో కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులను స్థానికులు అభినందించారు.
ఇదీచదవండి