ETV Bharat / state

నమ్మించి 'వంచించాడు'.. దిశ కేసుతో జైలుపాలయ్యాడు! - ప్రకాశం జిల్లా నేర వార్తలు

ప్రకాశం జిల్లాలోని దిశ పోలీస్ స్టేషన్​లో తొలి కేసు నమోదైంది. దర్శికి చెందిన ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

The first case was registered at the disha police station in prakasam district
దిశ పోలీస్ స్టేషన్​లో తొలి కేసు నమోదు
author img

By

Published : May 26, 2020, 7:56 AM IST

ప్రకాశం జిల్లా దర్శిలోని శివరాజ్ నగర్​కు చెందిన బత్తుల కిషోర్.. భవన నిర్మాణ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎనిమిది నెలల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా రామన్నపేట గ్రామానికి పనుల కోసం వెళ్ళాడు. అక్కడ పరిచయమైన ఓ బాలికను నమ్మించి వివాహం చేసుకున్నాడు. ఆ బాలికను రాష్ట్రానికి తీసుకువచ్చి ప్రకాశంజిల్లా చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెంలో నివసిస్తున్నాడు.

కొన్నిరోజుల అనంతరం ఆ బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నాడు. ఆమెను శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. కిషోర్ చేష్టలతో విసిగిపోయిన బాలిక.. పోలీసును ఆశ్రయించింది. ఎస్​పి ఆదేశాలతో స్థానిక దిశ స్టేషన్​లో కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి:

గోవిందుడి ఆస్తుల అమ్మకంపై గొడవ గొడవ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.