యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ప్రభుత్వంతో పాటు కొన్ని స్వచ్చంద సంస్థలు ముందుకొచ్చి ప్రజలకు సూచనలు చేస్తున్నారు. దానిలో భాగంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఆర్య వైశ్య మహాసభ సంఘం ఆద్వర్యంలో ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. బయటికి వచ్చే సమయంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, చేతులను సబ్బుతో కడుక్కోవాలని సూచించారు.
ఇవీ చూడండి...