Telugu Woman Spoke to Prime Minister Modi : ప్రకాశం జిల్లా కనిగిరి మండలం భూతంవారిపల్లికి చెందిన కొమ్మలపాటి వెంకటరమణమ్మ ఎంఏ బీఎడ్ పూర్తిచేశారు. తల్లి దండ్రులు, అత్తామామలు పూర్తిగా వ్యవసాయాధారిత కుటుంబాలు కావడంతో ఆమె కూడా ఈ రంగంపై మక్కువ పెంచుకున్నారు. సాగులో ఆమెకున్న ఆసక్తిని గమనించిన భర్త కొమ్మలపాటి వెంకటరావు వ్యవసాయంలో ఎదుర్కొంటున్న కష్టనష్టాలను ఆమెకు వివరిస్తుండేవారు. ఇది ఆమె ఆలోచనల్ని ఎంతగానో ప్రభావితం చేసింది.
మిద్దె పైనే మినీవనం.. చూడ్డానికీ రెండుకళ్లూ సరిపోవు.. ఎక్కడో తెలుసా!
Telugu Woman Used Technology in Cultivation : పాత విధానాలు విడనాడి తమకున్న అయిదు ఎకరాల భూమిలో డ్రోన్ల వినియోగంతో ఆధునిక సాగు చేస్తే ప్రయోజనం ఉంటుందని ఆమె భావించారు. అనుకున్నదే తడవు స్థానిక వ్యవసాయాధికారుల సలహాలు తీసుకుని ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ కళాక్షేత్రానికి వెళ్లి శిక్షణ తీసుకున్నారు. డ్రోన్ ద్వారా సాగుపై రెండు వారాల పాటు శిక్షణ పొందారు. ఏఏ పంటలు ఎలా సాగు చేయవచ్చు, డ్రోన్ వినియోగంతో వచ్చే ప్రయోజనాలు వంటివి పూర్తిగా తెలుసుకున్నారు.
Woman Spraying Fertilizers on Crops With Drones : వెంకటరమణమ్మ స్వయం సహాయక సంఘ గ్రూపు సభ్యురాలు కావడం, ఆధునిక సాగు విధానాల్లో ప్రవేశం ఉండటంతో ఆమె వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాలు పంచుకునే అవకాశం దక్కించుకున్నారు. నవంబరు 30న సింగరాయకొండ మండలం పాకలలో నిర్వహించిన వికసిత్ యాత్రలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు వెంకటరమణమ్మ కూడా పాల్గొన్నారు. సాక్షాత్తూ ప్రధాని మోదీతో వర్చువల్గా మాట్లాడే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి గానూ దేశవ్యాప్తంగా అయిదు గ్రామాలను ఎంపిక చేయగా, మన రాష్ట్రం నుంచి వెంకటరమణమ్మ ఎంపికై తన ప్రతిభ చాటారు.
వాట్సాప్ సాయంతో MBAవాలా ఆర్గానిక్ వ్యవసాయం, భారీగా ఆదాయం
Telugu Woman Farming With Drones: మోదీతో వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్న వెంకట రమణమ్మ సాగులో ఆధునిక విధానాలపై అనర్గళంగా హిందీలో ప్రసంగించారు. డ్రోన్ల వంటి ఆధునిక సాంకేతిక పరికరాలను వినియోగిస్తే మంచి దిగుబడులు పొందే అవకాశముందన్నారు. సులువైన శిక్షణ.. సులభ మైన పర్యవేక్షణ వాటితో సాధ్య పడతాయని వివరించారు. మూడే మూడు నిమిషాల్లో ఆమె తన అంతరంగాన్ని ఆవిష్కరించి మహిళా రైతుల్లో స్ఫూర్తి నింపారు. ఇలా సాంకేతిక పరిజ్ఞాన ఆలోచనతో డ్రోన్ ద్వారా పంటలకు పురుగు మందులు, ఎరువులను పిచికారి చేస్తూ గ్రామంలో మరికొందరికి అవగాహన కలిపిస్తూ మహిళలకు ఆదర్శంగా నిలిచింది.
" ఇప్పటికీ జిల్లాలో పాత సంప్రదాయ సాగు విధానాలే అనుసరి స్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనల్ని మనం సంస్క రించుకోవాల్సిన తరుణమిది. భారీ పెట్టుబడులు, విచ్చలవిడి పురుగు మందులను నియంత్రించాలి. డ్రోన్ వినియోగంతో సాగుపై సాధికారత సాధించొచ్చు. సులభంగా ఆపరేట్ చేసి పంట స్థితిని అంచనా వేయొచ్చు. ఏది అవసరమో గుర్తించి సస్య రక్షణ చేపట్టవచ్చు." - కొమ్మలపాటి వెంకట రమణమ్మ
Woman Inspiring Story : పది ఫెయిల్.. యూట్యూబ్ చూస్తూ నెలకు లక్షల్లో సంపాదన