TDP Cheif Chandrababu Naidu Letter to AP DGP: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రావివారిపాలెంలో నిన్న (సోమవారం) మధ్యాహ్నం అంగన్‌వాడీ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సవలం హనుమాయమ్మ (50) అనే మహిళను ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపిన ఘటనపై.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర డీజీపీతోపాటు జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్లకు చంద్రబాబు లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఎస్సీ మహిళ మృతిపై వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. హనుమాయమ్మ మృతిపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. ఈ దారుణ ఘటనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతకు సహకరించిన పోలీసులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం మృతురాలి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వడంతోపాటు ఆమె కుమార్తెకు ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Woman Murder: ట్రాక్టర్‌తో ఢీకొట్టి ఓ మహిళ ప్రాణం తీసిన వైసీపీ నాయకుడు
ఏపీ డీజీపీకీ చంద్రబాబు లేఖ.. టంగుటూరు మండలం రావివారిపాలేనికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సుధాకర్ భార్య హనుమాయమ్మను సోమవారం రోజున కొండలరావు అనే వ్యక్తి ట్రాక్టర్‌తో ఢీకొట్టి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆ హత్యపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. దళిత మహిళ దారుణ హత్యపై రాష్ట్ర డీజీపీ, నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ మహిళా కమిషన్‌లు వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరుపై, బడుగు, బలహీన వర్గాల హక్కులు హరించబడుతున్న విధానంపై ఆ లేఖల్లో ఆయన వివరంగా వివరించారు.
చంద్రబాబు నాయుడు రాసిన ఆ లేఖల్లో.. ''సవలం హనుమాయమ్మ (50) హత్యపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలి. హత్య ఘటనలో వైసీపీ నేతలకు సహకరించినా పోలీసులపైనా విచారణ జరిపించాలి. అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న హనుమాయమ్మ కుటుంబానికి రూ.1 కోటి పరిహారం ఇవ్వడంతో పాటు ఆమె కుమార్తెకు ఉద్యోగం ఇవ్వాలి. రాష్ట్రంలో జరుగుతున్న దారుణమైన ఘటనలపై, శాంతిభద్రతల పరిస్థితిపై ఇప్పటికే అనేకసార్లు తెలియజేశాం. కొందరు పోలీసులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తూ.. వైసీపీ నేతలకు బాసటగా నిలుస్తున్నారు. పోలీసులు నేరాలను అరికట్టడంపై పెట్టాల్సిన శ్రద్దను.. ప్రజాస్వామ్య నిరసనలు అణిచివేసేందుకు పెడుతున్నారు. పోలీసుల సహకారంతో జరగుతున్న వైసీపీ దౌర్జన్యాల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల వర్గాల ప్రజలు బాధితులు అవుతున్నారు. టంగుటూరు మండలం రావివారిపాలెంలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న దళిత మహిళ సవలం హనుమాయమ్మ దారుణ హత్యకు గురైంది. అదే గ్రామానికి చెందిన సంవలం కొండల రావు అనే వ్యక్తి హనుమాయమ్మను ట్రాక్టర్‌తో తొక్కించి అత్యంత దారుణంగా హతమార్చాడు. రెండుసార్లు ఆమెపై ట్రాక్టర్ నడిపించి మరీ కిరాతకంగా హనుమాయ్మను హత్య చేశాడు.'' అని ఆయన వివరించారు.
TDP YCP Concerns: ఉద్రిక్తతకు దారితీసిన టీడీపీ.. వైసీపీ ఆందోళనలు
పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయలేదు.. అనంతరం ఆ ఘటన జరుగుతున్న సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేసిన బాధితురాలి కుమార్తె మాధురిపైనా కూడా నిందితుడు దాడి చేశాడని చంద్రబాబు నాయుడు తాను రాసిన లేఖల్లో వెల్లడించారు. నిందితుడు ఎక్కడ ఉన్నాడు..? అనే విషయంలో స్థానికులు అక్కడికి వచ్చిన పోలీసులకు సమాచారం ఇచ్చినా అరెస్టు చేయకపోగా, అతను పారిపోయేందుకు సహకరించారని దుయ్యబట్టారు. ప్రభుత్వం స్పందించి వెంటనే నిందితులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఆ సమయంలోనే ఈ హత్య జరిగింది.. టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ప్రభుత్వ చర్యలను తప్పు పడుతూ శాంతియుత నిరసనలకు దిగిన సందర్భంలో పోలీసులు ఆయనను అరెస్టు చేశారని చంద్రబాబు వివరించారు. ఈ నిరసనల్లో హనుమాయమ్మ భర్త సలవం సుధాకర్ కూడా పాల్గొన్నారని.. ఆ సమయంలోనే ఈ హత్య జరిగిందని ఆయన తెలియజేశారు. ఎమ్మెల్యే నిరసనలను అణిచివేసేందుకు దృష్టిపెట్టిన పోలీసులు.. కిరాతక హత్యను మాత్రం పట్టించుకోలేదని చంద్రబాబు నాయుడు ఆక్షేపించారు. పట్టపగలే అత్యంత దారుణంగా జరిగిన హనుమాయమ్మ హత్యలో పోలీసు అధికారుల పాత్రపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
Tension in Kondepi కొండేపిలో పోటాపోటీ నిరసనలు.. ఉద్రిక్తత! టీడీపీ ఎమ్మెల్యే డోలా అరెస్ట్!