ప్రకాశం జిల్లా వేలూరు పంచాయతీ టి.సాలూరు గ్రామం ఎస్సీ కాలనీ వాసులు వేలూరు గ్రామ సచివాలయం ఎదుట నిరసన చేపట్టారు. గ్రామ సచివాలయం ద్వారా తమకు ఎటువంటి కార్యక్రమాలను వాలంటీర్లు తెలియపరచడం లేదని వాపోయారు. నీటి సమస్య ఉందంటూ అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా... పట్టించుకున్న దాఖలాలు లేవని కాలనీ వాసులు అన్నారు. తమపై చిన్న చూపు చూడటంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కలగజేసుకుని ఎస్సీ కాలనీకి న్యాయం చేయాలని కోరారు. లేకపోతే ధర్నాను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఈ విషయంపై స్థానిక నాయకులు కలగచేసుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి :