ప్రకాశం జిల్లా యద్దనపూడి ఎస్సై జీవీ చౌదరికి.. దేశీయ ఆవులంటే ప్రాణం. రైతు కుటుంబంలో పుట్టిన ఆయనకు.. గో పెంపకంపై ఎప్పట్నుంచో ఆసక్తి ఉన్నా... ఉద్యోగ రీత్యా వివిధ చోట్లకు తిరుగుతండటంతో వీలు పడలేదు. భార్య ప్రోత్సాహం, పిల్లలకు ఆవు పాలు ఇవ్వాలనే ఆలోచనతో తొలుత ఓ మేలు జాతి గోవును కొన్నారు. ఆవుల పెంపకం, వాటి ఆవశ్యకత, అంతరిస్తున్న గో జాతులపై అధ్యయనం చేశాక.. తాను వీలైనన్ని ఆవులను పెంచాలని భావించారు.
మార్టూరులో ఓ పాక నిర్మించి రెడ్ సింధి, పుంగనూరు, కపిల, గిర్, ఒంగోలు జాతి ఆవులను కొనుగోలు చేసి పెంచుతున్నారు. నెలకు 30 నుంచి 40 వేల దాకా ఆవుల సంరక్షణకు ఖర్చవుతుందని.. తాను ఎక్కడికి బదిలీ అయినా.. ఆవులనూ తీసుకెళ్తుంటానని జీవీ చౌదరి తెలిపారు. పని ఒత్తిడినీ లెక్క చేయకుండా గో జాతి సంరక్షణకు కృషి చేస్తున్న ఎస్సైని అందరూ అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి: