నూతన జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ... ఒంగోలులో అఖిలపక్ష యువజన విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. నగరంలోని ఫ్లై ఓవర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్కు విద్యార్థి సంఘాల నేతలను తరలించారు.
ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు... ఉద్యోగాల ప్రకటన లేకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఉద్యోగాలు కావాలని అడిగితే... పోలీసులతో అరెస్టులు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఇదీ చదవండి:
SR GROUP: కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఎస్ఆర్ గ్రూప్ సుముఖత