ETV Bharat / state

వేద గణితం... తొలగిస్తుంది విద్యార్థుల్లో భయం!

అమ్మో లెక్కలా.. అనే భయం చాలామంది నుంచి వ్యక్తమవుతూ ఉంటుంది. గణితం అంటే గజ గజ వణుకుతుంటారు విద్యార్థులు. పాఠ్యపుస్తకం నిండా పరిష్కరించాల్సిన సమస్యలు చూసి సతమతమైపోతుంటారు. అయితే వేద గణితంతో విద్యార్థుల్లో భయం పొగొట్టువచ్చని అంటున్నారు ప్రకాశం జిల్లా కనిగిరికి ఉపాధ్యాయుడు యస్​.వి.ఎల్ నారాయణ.

Vedic math's
Vedic math's
author img

By

Published : Dec 21, 2020, 5:19 PM IST

వేద గణితం... తీసేస్తుంది విద్యార్థుల భయం!

'నిఖిలం నవతః- చరమం దశతః' ఇదేదో మాయా మంత్రంలా అనిపిస్తుంది కదూ. కానీ ఇది వేద గణితంలోని ఓ సూత్రం. గణితంలోని సమస్యలను క్షణాల్లో సాధించడానికి అవసరమైన టెక్నిక్‌ను ఈ వేద గణితం నేర్పుతుంది. అలాగే సబ్జెక్టును విద్యార్థులు సులభరీతిలో అర్థం చేసుకోవడానికీ ఉపయోగపడుతుంది. ఆర్యభట్ట, వేదవ్యాసులు, వాల్మీకి, పోతన, శ్రీనాధుడు కాలంలో ఓ వెలుగు వెలిగింది వేద గణితం. కాల క్రమేణా మూలకు చేరింది. మళ్లీ ఇప్పుడు ఈ వేద గణితం నేర్చుకోవడానికి విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.

ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు వేద గణితంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. క్లిష్టమైన లెక్కలను సైతం చిటికెలో అవలీలగా పరిష్కరిస్తున్నారు. పట్టణానికి చెందిన ఎస్​వీఎల్ నారాయణ ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సాయంత్రం వేళల్లో పట్టణంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఉచితంగా ఈ వేద గణితాన్ని బోధిస్తున్నారు. ఈ పద్ధతిలో గణితాన్ని నేర్చుకుంటే క్యాల్క్యులేటర్​తో సమానంగా సమాధానాలు సాధించవచ్చని ఆయన తెలిపారు.

పోటీ పరీక్షల్లో మార్కులు సాధించేందుకు వేద గణితం బాగా ఉపయోగపడుతుండటంతో నేర్చుకునేందుకు విద్యార్థులు పోటీపడుతున్నారు. ఈ విధానం వల్ల లెక్కలంటే తమలో భయం పోయిందని వారు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

'కెరీర్ చివరిలో ఇలాంటి పిటిషన్​ను చూస్తాననుకోలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.