ప్రకాశం జిల్లాలో కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆర్థిక సహాయాన్ని అందించారు. పోలీసు శాఖ తరుఫున రావలసిన అన్ని రకాల ప్రయోజనాలను త్వరగా వచ్చే విధంగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని.. వారి కుటుంబ సభ్యులకు ఎస్పీ సిద్ధార్థ్ భరోసా కల్పించారు. ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులను మృతుల భార్యలకు అందజేశారు. కార్యక్రమంలో డీపీఓ సులోచన పాల్గొన్నారు.
ఇదీ చదవండి: