ప్రకాశం జిల్లా కనిగిరిలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో సోషల్ వెల్ఫేర్ అధికారిణి రాజేశ్వరమ్మ బెస్ట్ అవైలబుల్ విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్ ను రద్దు చేసిందని... అందుకు గాను విద్యార్థులు ఇబ్బంది పడకండా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సీయల్ స్కూల్స్ లో ఖాళీలున్న చోటు ఈ విద్యార్దులను సర్దుబాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఏఎస్డబ్ల్యూఓ రాజేశ్వరికి వినతి పత్రం ఇచ్చారు. ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లీష్ విద్యను అభ్యసించకుండా చేసేందుకే... ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ పాఠశాలలను రద్దు చేసిందని ఆరోపించారు.
ఇవీ చూడండి...