ETV Bharat / state

నిషేధిత భూముల జాబితాలోకి ఇనాం భూములు..పరిష్కారం కోసం ప్రజల పడిగాపులు ! - నిషేధిత భూముల జాబితాలోకి ఇనాం భూములు వార్తలు

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో నిషేధిత జాబితాలో చేరిన భూముల సమస్య కొలిక్కి రావటం లేదు. తరతరాలుగా హక్కులు కలిగి ఉండి క్రయవిక్రయాలు చేసి..రుణాలు పొందిన ప్రజలు ఇప్పుడు ఆ భూములు తమవి కాదంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. 2013లో జారీ అయిన జీవోకి 2019లో సవరణ చేసినప్పటికీ..వేలాది ఎకరాల భూములు వివాదంలోనే కొనసాగుతున్నాయని వాపోతున్నారు.

Singarayakonda land dispute at prakasham
నిషేధిత భూముల జాబితాలోకి ఇనాం భూములు
author img

By

Published : Jul 26, 2021, 7:20 PM IST

ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రాంతంలో సుమారు 2 వేల 500 ఎకరాల భూమి నిషేధిత జాబితాలో చేరింది. శ్రీ వరాహలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి చెందిన భూముల్లో..కొంత భూమిని గతంలో పర్సనల్‌ ఇనాం, చాకిరీ ఇనాంలుగా ప్రజలకు రాసి ఇచ్చారు. మరికొన్ని భూములు దేవస్థానం భూములుగానే ఉన్నాయి. ఇనాములుగా రాసి ఇచ్చిన భూములపై...ఆయా వ్యక్తులకు పూర్తి హక్కు ఉంటుంది. వ్యవసాయ భూముల్లో సాగు చేసుకోవడం, నివాస ప్రాంతాల్లో పక్కా ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నామని ప్రజలు చెబుతున్నారు.

భూముల క్రయవిక్రయాలు, ఇళ్ల నిర్మాణాలు, ఆస్తులు తనఖా పెట్టి బ్యాంకుల్లో రుణాలు పొందడం వంటివి 2013 వరకు సవ్యంగానే సాగింది. 2013లో ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం...ఇనామీ భూములన్నీ దేవాలయ భూములు కాబట్టి...హక్కులు కూడా దేవస్థానానికే చెందుతాయని వాటిని రిజిస్ట్రేషన్‌ చేయకూడదని నిషేధిత భూముల జాబితాలో చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ప్రజల ఇబ్బందులు గమనించిన ప్రభుత్వం 2019లో జీవోకు సవరణలు చేసింది.

2019లో విడుదల చేసిన జీవోలో సవరణలు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. పదేళ్లుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని ఇనామీ భూములు పొందినవారు చెబుతున్నారు. సొంత భూములు ఉన్నా..ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకుని తమ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి

కేంద్రం కీలక నిర్ణయం- తగ్గనున్న పప్పుల ధరలు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.