శ్రీశైలం మల్లన్న ఆలయానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతుంది... ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం. శ్రీ చక్ర ఆకారంలో ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన ప్రదేశం కావడంతో ఈ ప్రాంతానికి త్రిపురహాoతకం అని పేరు వచ్చింది. కాలక్రమేణ త్రిపురాంతకంగా మారింది. మూలస్థాన పీఠం అమ్మవారిది కాగా మధ్య స్థానంలో స్వామి కొలువై ఉంటారు. ఏ ఆలయానికి వెళ్లిన ఉత్తరం లేదా తూర్పు ద్వారాల నుంచి స్వామి వారిని దర్శించుకోవాలి. కానీ త్రిపురాంతకేశ్వర స్వామివారిని దర్శించుకోవాలంటే మాత్రం దక్షిణ నైరుతి ద్వారా మార్గంలో మాత్రమే వెళ్లాలి.
రాక్షసులు నిర్మించిన ఆలయం
రాక్షసులు నిర్మించిన ఆలయం కావడంతో వారి ప్రవేశం దక్షిణం నుంచి ఉంటుంది. రాక్షసులు వాస్తు ప్రకారమే ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవటానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు మెట్ల మార్గం చేరుకుని... ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు.