ప్రకాశం జిల్లా చీరాలలో అక్రమంగా తరలిస్తున్న40 బస్తాల గుట్కా ప్యాకెట్లను ప్రకాశం జిల్లా చీరాల రెండో పట్టణ పోలీసులు పట్టుకున్నారు. బైపాస్ రోడ్డులో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో ఒంగోలువైపు నుంచి వచ్చిన టాటా ఏస్ వాహనాన్ని తనిఖీ చేయగా... అందులో నలభై బస్తాల గుట్కా ప్యాకెట్లను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్.ఐ శ్రీకాంత్ తెలిపారు.
ఇదీ చదవండి: