ప్రకాశంజిల్లా దర్శి పట్టణంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం పోలీసులు సోదాలు చేశారు. ఇళ్లలో నిర్వహిస్తున్న దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాలలో ఓ ఇంట్లో నిషేధిత గుట్కా ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. సుమారు 20వేల రూపాయలు విలువ ఉంటుందని ఎస్సై రామకోటయ్య తెలిపారు. నిషేధిత గుట్కాలు అమ్ముతున్నట్లుగా అనుమానం ఉన్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇవీ చదవండి: చీరాల వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్కు ఉత్తమ సేవా పురస్కారం